: సైన్యం సామర్థ్యాన్ని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారు: ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం

పాకిస్థాన్ ఉగ్రవాదులు చేస్తోన్న అకృత్యాల‌పై చ‌ర్య‌ల‌కు దిగిన భార‌త సైన్యం ఇటీవ‌ల‌ నియంత్రణ రేఖను దాటి పీవోకేలో ఉగ్ర‌వాద శిబిరాల‌పై దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ అంశంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు స్పందిస్తూ దాడికి సంబంధించిన‌ ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాల తీరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఖండించారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భార‌త సైనిక చ‌ర్య‌పై ప‌లు పార్టీల నేత‌లు అనవసర సందేహాలు వ్యక్తం చేస్తున్నార‌ని అన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయకూడ‌ద‌ని తాము ల‌క్షిత దాడులు జ‌రిగిన‌ప్ప‌టి నుంచీ పేర్కొంటున్నామ‌ని ఆయ‌న అన్నారు. భార‌త జ‌వాన్ల‌ సామర్థ్యాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం ముందుకెళుతోంద‌ని అన్నారు.

More Telugu News