: ఆఫ్రికాలోని నైగర్ పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి.. 22 మంది సైనికుల మృతి

ఆఫ్రికాలోని నైగర్ పశ్చిమ సరిహద్దు ప్రాంతం టస్సారాలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. ఆ ప్రాంతంలో చొర‌బ‌డిన ఉగ్ర‌వాదులు 22 మంది సైనికుల ప్రాణాలు బ‌లిగొన్నారు. ఆ సైనికులంతా శరణార్థుల క్యాంపుకు ర‌క్ష‌ణగా ఉన్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింది. ఈ దాడిపై నైగర్ గ‌వ‌ర్న‌ర్ మాత్రం దాడికి సంబంధించిన వివ‌రాల‌పై స్పందించ‌డం లేదు. ఆ దేశ మీడియా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ ఘటన నిన్న అర్ధ‌రాత్రి జ‌రిగింద‌ని, ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌ర‌ప‌డంతో నైగ‌ర్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొంది. ఉగ్రవాదుల కోసం అక్క‌డ ఆర్మీ క్షుణ్ణంగా త‌నిఖీలు చేప‌డుతోంది. మాలి ఉత్తరప్రాంతానికి చెందిన ఉగ్రవాదులే త‌మ సైనికుల‌పై కాల్పులు జ‌రిపి ఉంటార‌ని వారు భావిస్తున్నారు.

More Telugu News