: రోహిత్ వేముల దళితుడు కాదు.. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడు: తేల్చి చెప్పిన కమిషన్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని, వ్యక్తి గత కారణాల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని జస్టిస్ రూపన్ వాలా కమిషన్ తేల్చి చెప్పింది. మానవ వనరుల శాఖకు ఈమేరకు అందజేసిన తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. రోహిత్ తల్లి దళితురాలు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలకు ఎటువంటి ప్రమేయం లేదని వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆ నివేదికలో పేర్కొంది. హెచ్ సీ యూలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జస్టిస్ రూపన్ వాలా కమిషన్ సూచించింది.

More Telugu News