: ముంబైలో శివసేనకు షాక్... ఒంటరిగా తేల్చుకుంటామన్న బీజేపీ

గడచిన రెండు దశాబ్దాలుగా కలసి ముంబై మహానగరాన్ని ఏలుతున్న శివసేన-బీజేపీ కూటమి చీలిపోయింది. వచ్చే సంవత్సరం ఆరంభంలో జరిగే ముంబై మహానగర్ పాలికా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో ఇరు పార్టీలూ కలసి పోటీ చేయగా, శివసేనకు 76 సీట్లు, బీజేపీకి 32 సీట్లు లభించిన సంగతి తెలిసిందే. శివసేన పాలనలో అవినీతి పెరిగిందని ముంబై నగర వాసులు విమర్శిస్తున్న వేళ, ఆ పార్టీతో విడిపోయి, ప్రజలకు దగ్గర కావాలన్న రాజకీయ ఎత్తుగడలో భాగంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్రంలో బీజేపీకి శివసేన మద్దతిస్తున్నప్పటికీ, రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలూ సాధారణమై పోయిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.

More Telugu News