: ఆర్బీఐ పావలా తగ్గిస్తే, 5 పైసల ప్రయోజనాన్ని కస్టమర్లకిచ్చిన ఐసీఐసీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పావు శాతం మేరకు తగ్గిస్తూ, ఆ ప్రయోజనాన్ని బ్యాంకు ఖాతాదారులకు వెంటనే అందించాలన్న ఉర్జిత్ పటేల్ సూచనకు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ స్పందించింది. తామిస్తున్న రుణాలపై 0.05 శాతం మేరకు వడ్డీ తగ్గిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 0.89 శాతం నుంచి 0.85 శాతానికి తగ్గిస్తున్నామని, వార్షిక ఎంసీఎల్ఆర్ ను 9.10 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టని పేర్కొంది. కాగా, జనవరి 2015 నుంచి రెపో రేటు 1.75 శాతం తగ్గగా, బ్యాంకుల బేస్ రేటు 0.60 శాతం మాత్రమే తగ్గిందన్న సంగతి తెలిసిందే.

More Telugu News