: సిరియాలో గగనతల రక్షణకు క్షిపణ వ్యవస్థను మోహరించిన రష్యా

సిరియాలో గగనతల రక్షణకు క్షిపణి వ్యవస్థ ఎన్-300ను రష్యా మోహరించింది. సిరియాలోని రేవు పట్టణం టార్టస్ లో ఈ వ్యవస్థను సిద్ధంగా ఉంచింది. ఎస్‌ఏ-23గా సుపరిచితమైన ఎస్‌-300 వ్యవస్థను ఇప్పటి వరకు రష్యా బయట వినియోగించలేదు. దీని రాడార్లు, లాంఛర్లు, కమాండ్‌ వ్యవస్థను పూర్తిగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ట్రక్కులపై తరలించే వీలుంది. గతంలో సిరియా సరిహద్దుల్లో రష్యా విమానాన్ని కూల్చడంతో టర్కీ, రష్యా మధ్య విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ విమానాన్ని సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కూల్చేసినట్టు పేర్కొన్నప్పటికీ వారికి అంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని, ఎవరో కుట్రపన్ని కూల్చేశారని రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎన్-300 ను సిరియాకు తరలించింది. దీనికి ఎస్‌-400 వ్యవస్థను కూడా చేరిస్తే పూర్తిస్థాయి వైమానిక నిరోధక వ్యవస్థ సిద్ధమైపోతుంది. ఈ వ్యవస్థ సిరియాకు సమీపంలోని రష్యా వైమానిక స్థావరమైన లటాకియాలో సిద్ధంగా ఉంది. కాగా, పశ్చిమ ప్రాంతం నుంచి ఐఎస్ఐఎస్ ను తరిమికొట్టేందుకు వైమానిక దాడులను సమన్వయం చేసుకునేందుకు రష్యాతో సిరియా సమావేశమైంది. సిరియాలోని భూతలపోరాటం చేస్తున్న కుర్దిష్ రెబల్స్, సిరియా సంకీర్ణ సేనలకు రష్యా గగనతల దాడులతో సాయం చేయనుంది.

More Telugu News