: సోషల్ మీడియా వల్లే కిమ్ కార్దాషియాన్ దోపిడీ?

అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ నిలువు దోపిడీకి గురైన సంగతి తెలిసిందే. ఆమె నిలువుదోపిడీకి కారణం సోషల్ మీడియా అంటే నమ్మగలరా? అవును నిజం, సోషల్ మీడియాయే ఆమెను నిలువునా దోపిడీకి గురయ్యేలా చేసింది. సామాజిక మాధ్యమాల్లో కిమ్ కర్దాషియాన్ చాలా చురుగ్గా ఉంటుంది. ఆమె ఏం చేసినా సోషల్ మీడియాకు తెలియాల్సిందే. ఫాలోవర్లు విశేష సంఖ్యలో ఉన్న కిమ్... ఎప్పటికప్పుడు తన గురించిన అప్ డేట్స్ షేర్ చేసుకుంటుంది. అందులో భాగంగా ఈ మధ్యే తన భర్త కాన్యే వెస్ట్ తనకు బహుమతిగా ఇచ్చిన ఖరీదైన ఉంగరాన్ని, చైనును ఫోటోలతో సోషల్ మీడియాతో పంచుకుంది. అంతే కాకుండా పారిస్ వెళ్లిన కిమ్... తాను ఎక్కడున్నది, ఏం చేస్తున్నది ట్విట్టర్, ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. కిమ్ హాట్ ఫొటోల గురించి నిత్యం వెతికే వారు ఆమె ఎప్పుడు ఏం చేస్తుదో సులువుగా చెప్పేయగలరంటే అతిశయోక్తి కాదు. పారిస్ లో జరగనున్న ఫ్యాషన్ వీక్ కోసం వచ్చిన కిమ్ అలవాటుగా తన గురించిన పూర్తి వివరాలు తానే వెల్లడించింది. దీంతో దోపిడీ దొంగలు పోలీసు వేషాల్లో వచ్చి కాగల కార్యం పూర్తి చేసుకుని వెళ్లారు. తనకు పిల్లలు ఉన్నారని, తనను ఏమీ చేయవద్దని వేడుకున్నానని, దీంతో దాదాపు 67 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లిపోయి, తనను వదిలేశారని ఆమె తెలిపింది.

More Telugu News