: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: భారత వైమానిక దళ చీఫ్

భారత్-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని భారత వైమానిక దళ చీఫ్ అరూప్ రాహా పేర్కొన్నారు. రాబోయే కొన్నేళ్లలో యుద్ధవిమానాల సంఖ్య పెంచుతామని, ఫ్రాన్స్ నుంచి 36 రఫెల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అయితే, దేశంలోనే యుద్ధ విమానాలు తయారు చేసే ప్రణాళిక ఉందని, యుద్ధ విమానాల తయారీకి భారత్ హబ్ గా మారనుందని పేర్కొన్నారు. తేజస్ విమానాలను భారీ సంఖ్యలో వినియోగంలోకి తీసుకువస్తామని, సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల స్థాయిని పెంచుతామని వెల్లడించారు. 2021 సంవత్సరం నాటికి తేజస్ కొత్త వెర్షన్ ‘మార్క్-1 ఏ’ విమానాలు ఉత్పత్తి చేస్తామని, 2027 సంవత్సరం నాటికి ఈ యుద్ధ విమానాల సంఖ్య 80 వరకు ఉంటాయని ఆయన చెప్పారు.

More Telugu News