: ఈ నెల 7 నుంచి 18 వరకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయండి: ‘కావేరీ’పై సుప్రీం తాజా ఆదేశాలు

కావేరీ జ‌లాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి పలుసార్లు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన‌ ఆదేశాలను క‌ర్ణాట‌క మొద‌ట అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన సుప్రీంకోర్టు నేటికి డెడ్‌లైన్ విధించి నీరు విడుద‌ల చేయాల్సిందేన‌ని చెప్పింది. అయితే, అంశంపై ఈ రోజు క‌ర్ణాట‌క తాము నీటిని విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్ప‌డంతో సుప్రీం మ‌రో ఆదేశాల‌ను జారీ చేసింది. మొద‌ట ఈనెల‌ 6 వ‌ర‌కు కావేరీ జ‌లాల‌ను విడుద‌ల చేయాల‌ని సూచించిన సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను కొనసాగిస్తూ... ఈనెల 18 వ‌ర‌కు నీటిని విడుద‌ల చేయాలని చెప్పింది. అయితే, ఈ నెల 7 నుంచి 18 వ‌ తేదీల్లో రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.

More Telugu News