: 'రెడీ ఫర్ సైబర్ వార్'... నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సైట్ ను హ్యాక్ చేసి, హెచ్చరించిన పాక్ హ్యాకర్లు

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వెబ్ సైట్ ను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ వెబ్ సైట్ ను ఆక్రమించుకున్న హ్యాకర్లు పాక్ అనుకూల నినాదాలను పోస్ట్ చేశారు. ఇక భారత టెక్ వీరులు తమతో సైబర్ పోరాటాలకు సిద్ధం కావాలంటూ హెచ్చరించారు. పాకిస్థాన్ పై భారత సైన్యం జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఈ పని చేసినట్టు స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని వెబ్ సైట్లను హ్యాక్ చేస్తామని, సత్తా ఉంటే ఆపుకోవచ్చని చెప్పారు. 'డి4ఆర్కే 4ఎన్జీ 31' పేరిట ఉన్న హ్యాకర్ టీమ్ దీన్ని ఆక్రమించుకున్నట్టు వెల్లడిస్తూ, ఇండియాను హెచ్చరిస్తున్నట్టు వేలు చూపిస్తున్న ఓ బాలుడి చిత్రాన్ని ఉంచారు. తమను ఎవరూ జయించలేరన్న మెసేజ్ కూడా ఉంచారు.

More Telugu News