: నయీంతో దందా నడిపిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని విచారించిన సిట్

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మొదటి సారి రాజకీయ నేతను సిట్ ప్రశ్నించింది. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. భువనగిరిలో సుమారు 3 గంటలపాటు సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. నయీంతో కలిసి చింతల దందా నడిపాడని సిట్ గుర్తించింది. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను సిట్ స్వాధీనం చేసుకుంది. ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టింది. ఆయనను మరో మూడు సార్లు సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటివరకు నయీం ఘటనలో 195 పీటీ వారెంట్లు జారీ చేయగా, మొత్తం 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా 95 మందిని అరెస్టు చేయగా, ఐదుగురు న్యాయస్థానం ముందు లొంగిపోయారు. కాగా, సిట్ అదుపులో ఇంకా 72 మంది ఉన్నారు. చింతల విచారణ అనంతరం మరి కొంత మంది రాజకీయనాయకులు, పోలీసు అధికారులను సిట్ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News