: 8 నుంచి 12వ తేదీ మధ్య... 5 రోజుల్లో బ్యాంకులు పనిచేసేది ఒక్క రోజే!

వారాంతం, ఆపై పండగల సెలవులతో ఈ నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య 11, 14 తేదీల్లో బ్యాంకులు పనిచేయనుండగా, మిగతా రోజులన్నీ సెలవులే. ముఖ్యంగా 8 నుంచి 12 మధ్య 5 రోజుల్లో బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతబడనున్నాయి. అది కూడా ఓ వైపు దసరా, మరోవైపు మొహర్రం ఉండటంతో ఏటీఎంలు నిండుకునే పరిస్థితి నెలకొంది. 8వ తేదీన రెండో శనివారం బ్యాంకులకు సెలవు కాగా, ఆపై 9 ఆదివారం. సోమవారం నాడు బ్యాంకులు పనిచేయనుండగా, మంగళవారం దసరా, బుధవారం మొహర్రం సందర్భంగా సెలవులు వచ్చాయి. దీంతో తిరిగి సోమవారం మూతపడే బ్యాంకులు బుధవారం నాడు తెరచుకుంటాయి. దీన్ని ముందుగానే గమనించి లావాదేవీలను పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

More Telugu News