: రాష్ట్ర విభజన జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్ర విభజన జరుగుతుందని తాము ఎప్పుడూ ఊహించలేదని ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజ‌య‌వాడలోని కేఎల్ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ‘టీడీపీ నేత‌ల‌కు మూడు రోజుల శిక్ష‌ణ త‌ర‌గ‌తులు’ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ రాష్ట్ర‌విభ‌జ‌న అనంత‌రం జ‌రిగిన‌ ప‌రిణామాలపై మాట్లాడారు. కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌క‌టించిన ప్యాకేజీ వ‌ల్ల లాభాల‌పై అవగాహ‌న క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. తెలుగు దేశం పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి తాము శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు ప్రాముఖ్య‌తనిచ్చిన‌ట్లు చెప్పారు. నాయ‌క‌త్వాల‌ను పెంపొందించుకోవాల‌ని, భ‌విష్య‌త్తులో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక వేసుకొని అందుకు అనుగుణంగా వెళ్లాలని సూచించారు. విభజన తరువాత ప్రజల్లో స్తబ్ధత నెలకొందని ఆయ‌న అన్నారు. విభజన నిర్ణయం వచ్చాక ఇరు రాష్ట్రాల‌కూ న్యాయం చేయాల‌ని తాము అప్ప‌ట్లో కేంద్రాన్ని కోరిన‌ట్లు తెలిపారు. విభజనకు ముందు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు.

More Telugu News