: కిమ్ కర్దాషియన్ నుంచి రూ. 67 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లిన దుండగులు

పారిస్ లో జరుగుతున్న ఓ ప్రదర్శనలో పాల్గొనేందుకు రియాలిటీ టీవీ స్టార్, హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ వచ్చిన వేళ, తుపాకీ గురిపెట్టిన దుండగులు ఆమెను దోచుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీకి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పారిస్ నుంచి బతుకుజీవుడా అనుకుంటూ న్యూయార్క్ చేరిన ఆమె, తన భర్త కేన్యీ వెస్ట్ తో కలసి దోపిడీపై ఫిర్యాదు చేసింది. తన నుంచి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 67 కోట్లు) విలువైన నగలను దోచుకెళ్లారని తెలిపింది. 4.5 మిలియన్ డాలర్ల విలువైన ఉంగరం, 5.6 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలున్న బాక్స్, రెండు మొబైల్ ఫోన్లు పోయాయని తెలిపింది. దుండగుల దాడితో తాను వణికిపోయానని, అయితే, తనపై భౌతికదాడి జరగలేదని కిమ్ తెలిపింది. ఆపై మీడియా ప్రశ్నలకు సమాధానమివ్వకుండా తప్పించుకుని వెళ్లిపోయింది. పోలీసు అధికారుల వేషంలో వచ్చిన సాయుధులైన ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారని ఆమె ప్రతినిధి తెలిపారు. కిమ్ పడక గదిలోకి దూసుకొచ్చిన వారు, దోపిడీ అనంతరం సైకిళ్లపై పారిపోయారని వివరించారు. ఆ సమయంలో కిమ్ బాడీగార్డు పాస్కల్ దువీయర్ అక్కడ లేరని, పారిస్ నైట్ క్లబ్ కు వెళ్లిన కిమ్ చెల్లెలికి రక్షణగా అక్కడుండి పోయారని తెలిపారు.

More Telugu News