: చైనా వస్తువులను బహిష్కరించాలంటూ బీజేపీ నేత పిలుపు

చైనా వస్తువులను మనం కొనుగోలు చేస్తే పరోక్షంగా పాకిస్థాన్ కు మద్దతు ఇస్తున్నట్లేనని, అందుకే, ఆ వస్తువులను వాడకుండా బహిష్కరించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మసూద్ అజహర్ ను ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా అడ్డుపడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని భారత్ చూస్తుంటే, పాక్ కు చైనా వత్తాసు పలుకుతుండటం ఆవేదనకు గురి చేస్తోందని అన్నారు. దసరా నవరాత్రుళ్ల సందర్భంగా పూజా కార్యక్రమాలకు అవసరమైన చాలా సామాగ్రి చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామని, ఎంత తక్కువ ధరకు వచ్చినా వాటిని కొనుగోలు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.

More Telugu News