: మహారాష్ట్రలో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త నిబంధన?

దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణకు, వాహనాల కాలుష్యం బారిన ప్రజలను రక్షించేందుకు గాను ‘సరి-బేసి’ సంఖ్య విధానం ప్రస్తుతం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణ దిశగా చర్యలు చేపట్టనుంది. ఢిల్లీ తరహాలో కాకుండా మరో కొత్త పద్ధతిలో ముందుకు వెళ్లనుంది. ముంబయిలో పార్కింగ్ స్థలాల విషయమై దాఖలు అయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ముంబయి హైకోర్టు ఈరోజు విచారణ చేసింది. ట్రాఫిక్ నియంత్రణపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని ఈమేరకు హైకోర్టు ఆదేశించింది. ఈ కాలంలో ఒక్కో కుటుంబానికి రెండేసి కార్లు ఉన్నాయని, అదీకాకుండా, అనుమతి లేని ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించడం కారణంగా ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కవ అవుతున్నాయని, ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలంటే మూడు గంటల సమయం పడుతోందని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ విషయమై బీఎంసీ, ఎమ్ఎమ్ఆర్ఢీఏ, పట్టణాభివృద్ధి శాఖ, ట్రాఫిక్ పోలీసులు అంతా కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాగా, ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం ‘వన్ ఫ్యామిలీ-వన్ కారు’ అనే కొత్త నిబంధనను ‘మహా’ ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం.

More Telugu News