: ఈ దీపావళికి కారు కొంటున్నారా? అన్ని రకాల బడ్జెట్లలో లభించే కార్లు, ఈఎంఐ వివరాలు

ఈ పండగ సీజన్ లో కారు కొనాలని భావిస్తున్నారా? రూ. 5 లక్షలలోపు, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు, రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య లభించే కార్లలో ముఖ్యమైన మోడల్స్ ధరలు ఇవి. వాటిని రుణంపై కొనుగోలు చేయాలంటే పడే వడ్డీ, కాలపరిమితిని బట్టి నెలసరి ఈఎంఐ తదితరాలనూ ఇక్కడ తెలుసుకోవచ్చు. (కార్ దేఖో డాట్ కాంతో ఒప్పందం కుదుర్చుకున్న ఎకనామిక్ టైమ్స్ అందించిన వివరాలివి) రూ. 5 లక్షల దిగువన: మారుతి సుజుకి ఆల్టో 800: ధర రూ. 2.49 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 796 సీసీ, మైలేజ్ 20.3 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 1.99 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 6,412 (మూడేళ్లు), రూ. 4,240 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 2,824 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 1.45 లక్షలు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10: ధర రూ. 4.39 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,086 సీసీ, మైలేజ్ 16.4 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 3.51 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 11,309 (మూడేళ్లు), రూ. 7,479 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 3,516 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 2.46 లక్షలు. టాటా టియాగో: ధర రూ. 3.20 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,199 సీసీ, మైలేజ్ 19.2 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 2.56 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 8,248 (మూడేళ్లు), రూ. 5,455 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 2,997 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 1.71 లక్షలు. రినాల్ట్ క్విడ్: ధర రూ. 2.60 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 799 సీసీ, మైలేజ్ 22.9 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 2.11 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 6,799 (మూడేళ్లు), రూ. 4,496 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 2,517 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 1.32 లక్షలు. డాట్సన్ రెడీ గో: ధర రూ. 2.38 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 799 సీసీ, మైలేజ్ 21.4 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 1.90 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 6,122 (మూడేళ్లు), రూ. 4,048 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 2,690 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 1.30 లక్షలు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య: హ్యుందాయ్ ఎలైట్ ఐ20: ధర రూ. 6.16 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1396 సీసీ, మైలేజ్ 13.3 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 4.92 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 15,744 (మూడేళ్లు), రూ. 10,367 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 4,323 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 3.10 లక్షలు. మారుతి సుజుకి బాలెనో: ధర రూ. 5.25 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1197 సీసీ, మైలేజ్ 17.8 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 4.20 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 13,440 (మూడేళ్లు), రూ. 8,850 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 3,228 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 3.06 లక్షలు. మారుతి సుజుకి విటారా బ్రెజా: ధర రూ. 7.19 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,248 సీసీ, మైలేజ్ 20.8 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 5.75 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 18,400 (మూడేళ్లు), రూ. 12,116 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 2,767 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 4.19 లక్షలు. మారుతి సుజుకి స్విఫ్ట్: ధర రూ. 5.01 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,197 సీసీ, మైలేజ్ 15.6 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 4 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 12,800 (మూడేళ్లు), రూ. 8,429 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 2.92 లక్షలు. మహీంద్రా కేయూవీ 100: ధర రూ. 5.05 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,198 సీసీ, మైలేజ్ 15.5 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 4.04 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 12,928 (మూడేళ్లు), రూ. 8,513 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 3,708 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 2.86 లక్షలు. రూ. 10 నుంచి రూ. 15 లక్షల మధ్య: టయోటా ఇన్నోవా క్రెస్టా: ధర రూ. 13.72 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 2,694 సీసీ, మైలేజ్ 12 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 10.9 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 34,864 (మూడేళ్లు), రూ. 22,858 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 4,803 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 7.27 లక్షలు. హ్యుందాయ్ క్రెటా: ధర రూ. 10.34 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,591 సీసీ, మైలేజ్ 11.2 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 8.27 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 26,283 (మూడేళ్లు), రూ. 17,232 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 5,130 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 5.79 లక్షలు. మారుతి సియాజ్: ధర రూ. 10.28 లక్షలు (డీజిల్), ఇంజన్ కెపాసిటీ 1,248 సీసీ, మైలేజ్ 25.1 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 8.22 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 26,124 (మూడేళ్లు), రూ. 17,128 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 1,878 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 6 లక్షలు. హోండా సిటీ: ధర రూ. 10.38 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,497 సీసీ, మైలేజ్ 15 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 8.30 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 26,379 (మూడేళ్లు), రూ. 17,295 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 3,843 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 5.69 లక్షలు. హోండా బీఆర్-వీ: ధర రూ. 10.90 లక్షలు (పెట్రోల్), ఇంజన్ కెపాసిటీ 1,497 సీసీ, మైలేజ్ 11.9 కి.మీ/ లీటర్ రుణ ఈఎంఐ : ధరలో 80 శాతంగా రూ. 8.70 లక్షలు రుణం తీసుకుంటే, 10.5 శాతం వడ్డీపై రూ. 27,713 (మూడేళ్లు), రూ. 18,170 (ఐదేళ్లకు) చెల్లించాల్సి వుంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారనుకుంటే నెలకు రూ. 4,842 రన్నింగ్ కాస్ట్ పడుతుంది. ఐదేళ్ల తరువాత రీసేల్ వాల్యూ రూ. 5.97 లక్షలు. * అన్ని ధరలూ ఎక్స్ షోరూం - న్యూఢిల్లీవి. హోండా సిటీ మినహా మిగతా అన్ని వేరియంట్లూ మాన్యువల్ గేర్ ట్రాన్స్ మిషన్. సెప్టెంబర్ 15 నాటి పెట్రోల్, డీజిల్ ధరలపై ఆధారపడి రన్నింగ్ కాస్ట్ లెక్కించారు. ఐదేళ్ల తరువాత 50 వేల కిలోమీటర్లు తిరిగిన వాహనాలపై రీసేల్ వాల్యూ లెక్కింపు జరిగింది.

More Telugu News