: భారత్ కు షాకిచ్చేందుకు నిదానంగా కదులుతున్న న్యూజిలాండ్

కష్టసాధ్యం కాని 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 55 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయినప్పటికీ, నిదానంగా ఆచి తూచి ఆడుతూ, 100 పరుగుల మైలురాయిని మరో వికెట్ నష్టపోకుండా చేరుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఇండియాకు షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో, నాలుగో రోజు రెండో సెషన్లో నికోల్స్, లాధమ్ లు నిదానంగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 33.4 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ జట్టు 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. లాథమ్ 92 బంతుల్లో 53, నికోలస్ 61 బంతుల్లో 23 పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే, మరో 276 పరుగులు చేయాల్సి వుంది. ఆట మరో ఒకటిన్నర రోజులు మిగిలుండటంతో, వికెట్లు కాపాడుకుంటే, అదేమంత కష్టమేమీ కాదు. ఇండియా విజయం సాధించాలంటే 9 వికెట్లు తీయాల్సి వుంది. ముఖ్యంగా టాపార్డర్ ను నేడు పెవీలియన్ కు పంపించేయాలి. ఈ నేపథ్యంలో ఆటలో డ్రా చాన్సులు లేకపోగా, ఏదో ఒక జట్టు విజయానికే అవకాశాలు అధికమని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News