: మిగిలింది రెండు రోజుల ఆట... కివీస్ ఆటగాళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా భారత్ కు ఇబ్బందే!

పేటీఎం టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ ముందు 376 పరుగుల లక్ష్యాన్ని ఇండియా నిర్దేశించినప్పటికీ, గెలుపుపై పూర్తి నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. ఇంకా దాదాపు రెండు రోజుల ఆట మిగిలివుండటంతో, న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఏ ఇద్దరు ముగ్గురు కుదురుకున్నా ఈ స్కోరును సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అసాధ్యం కాని లక్ష్యాన్ని చేరుకునేందుకు వచ్చే కివీస్ ఆటగాళ్లు ఏ మేరకు క్రీజులో ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే సమయంలో భారత్ కు కావాల్సింది 10 వికెట్లు. జోరుమీదున్న అశ్విన్, జడేజాలు, అచ్చొచ్చిని ఈడెన్ పిచ్ భారత్ కు అనుకూలాంశాలని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. నేడు లంచ్ విరామం తరువాత ఆట అత్యంత కీలకం కానుంది. ఆ సెషన్లో కీలక వికెట్లు తీయకుంటే, ఇండియా ఘోరమైన దెబ్బ తినే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, గుప్తిల్, టేలర్, రోంచీ, శాంట్ నర్ ల వికెట్లు సాధ్యమైనంత త్వరగా కూల్చడం ఎంతో ముఖ్యం. వీరిలో ఏ ఇద్దరైనా క్రీజులో పాతుకుపోయి సెంచరీలు చేస్తే టెస్టు సిరీస్ 1-1తో సమం కావడం ఖాయం.

More Telugu News