: పాక్ దమనకాండపై పీఓకేలో వెల్లువెత్తుతున్న నిరసనలు.. ఐఎస్ఐ కన్నా కుక్కలే నయమంటూ నినాదాలు

పాకిస్థాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి వ్యతిరేకంగా గళమెత్తుతున్న ప్రజలు తమ ఆందోళనను రోజురోజుకీ మరింత ఉద్ధృతం చేస్తున్నారు. పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. స్వాతంత్ర్యాన్ని కోరుతున్న నేతలపై పాక్ ఆర్మీ, ఐఎస్ఐ దారుణంగా ప్రవర్తిస్తున్నాయంటూ కోట్లీ ప్రాంత ప్రజలు ఆరోపించారు. చట్టవ్యతిరేక చర్యలు, నకిలీ ఎన్‌కౌంటర్లతో ప్రజలను అణచివేయాలని చూస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ‘‘ఐఎస్ఐ కన్నా కుక్కలే నయం’’ ‘‘కసాయి ఆర్మీ’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రజల తరపున పోరాడిన కశ్మీర్ జాతీయవాది, ఆల్ పార్టీ నేషనల్ అలయన్స్(ఏపీఎస్ఏ) చైర్మన్, జమ్ముకశ్మీర్ నేషనల్ లిబరేషన్(జేకేఎన్ఎల్‌సీ) అధ్యక్షుడు ఆరిఫ్ షాహిద్ మే 24, 2013న రావల్పిండిలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయనను ఐఎస్ఐ హత్య చేయించిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. పాక్ దమనకాండను ఇక సాగనీయబోమని హెచ్చరిస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం గళమెత్తుతున్న ప్రజలను పాక్ ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. భారీ బలగాలను మోహరించింది.

More Telugu News