: మండలాల ఏర్పాటు విషయంలో నాడు ఎన్టీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించాను: సీఎం కేసీఆర్

నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలాల కమిటీలో తాను సభ్యుడినని, తొలుత ఆ విధానాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, మండలాల ఏర్పాటు విజయవంతమైందని సీఎం కేసీఆర్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అదే కోణంలో, కొత్త జిల్లాల ఏర్పాటు మంచి ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. కొత్త జిల్లాలు దసరా పండగ నుంచే ప్రారంభం కావాలని ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఆదేశించారు. శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి పేరు పెడతామని, గండీడ్ మండలాన్ని మహబూబ్ నగర్ లో చేర్చుతామని, ఆందోల్ నియోజకవర్గంలో వట్టిపల్లి మండల ఏర్పాటును పరిశీలిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో కొత్తగా నేరేడుకొమ్ము, మల్లారెడ్డి గూడెంలు ఉండబోతున్నాయని, సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మండలం ఏర్పాటుపై పరిశీలిస్తామని కేసీఆర్ వివరించారు.

More Telugu News