: దాదాపు 50 వేల లడ్డూలు పాడైపోయాయి: దుర్గగుడి ప్రసాదంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు

లడ్డూ ప్రసాదంలో పురుగులు, ఈగలు వస్తున్నాయన్న భక్తుల ఫిర్యాదు మేరకు దుర్గగుడి వైస్ చైర్మన్ శేఖర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆ లడ్డూలను వెంటనే తీసివేయాలని ఆదేశించారు. ఆ విధంగా దాదాపు 50 వేల లడ్డూలు పాడైపోయినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. అపరిశుభ్ర వాతావరణంలో లడ్డూల తయారీపై విచారణ జరుపుతామని దుర్గగుడి నిర్వహణ కమిటీ పేర్కొంది. కాగా, ఈ లడ్డూలను తయారు చేస్తున్న పాతగోడౌన్ లోని సీలింగ్ పై పురుగులు లెక్కకు మించి ఉండటం, దీనికి తోడు, లడ్డూలపై విపరీతంగా ఈగలు వాలుతుండటంపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

More Telugu News