: అమ్మాయిలు కన్యత్వ పరీక్షలు చేయించుకుంటేనే కాలేజీకి... చట్టసభ సభ్యుడి వ్యాఖ్యలు

ఈజిప్ట్ చట్ట సభల సభ్యుడు ఎల్హామీ అజీనా మరోసారి మహిళల పట్ల సంకుచితంగా మాట్లాడారు. అమ్మాయిలు ప్రతి ఒక్కరూ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందడానికి ముందు కన్యత్వ పరీక్షలు చేయించుకోవాలని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలోకి అడుగుపెట్టే ఏ అమ్మాయి అయినా సరే ఆమె కన్యయేనా? అనేదాన్ని తెలుసుకునేందుకు వైద్య పరీక్షల పత్రాలను పరిశీలించాలన్నారు. తాను కన్యే అంటూ అందుకు సంబంధించి ప్రతీ అమ్మాయి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈజిప్టు వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అజీనాపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్, ఫేస్ బుక్ లో డిమాండ్లు పెరిగిపోయాయి. ఎల్హానీ అజీనా గత నెలలోనూ ఓ సారి ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈజిప్టు పురుషులు శృంగారంలో బలహీనులు. అందుకని మహిళలు వారి వాంఛలు తగ్గించుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News