: చెరువుల్లో చేపలు పెంచుతాం.. సొసైటీ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతాం: కేసీఆర్

చెరువుల్లో చేపపిల్లలు పెంచి ముదిరాజులు, బెస్తలతోపాటు ఇతర కులాలకు చెందిన చేపల పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఎల్లుండి(3వ తేదీ) నుంచే చెరువుల్లో చేప పిల్లలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ పల్లెలు స్వయం సమృద్ధి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేసేలా చేప పిల్లల పెంపకం సాగాలని అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో నిండిన 4533 చెరువుల్లో 35 కోట్ల చేప పిల్లలు పెంచాలని నిర్దేశించినట్టు తెలిపారు. ఇందుకోసం మొత్తం రూ.48 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసానిని ఆదేశించారు. సమీక్షలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News