: మా అబ్బాయి నటుడిగా కెరీర్ ప్రారంభించేందుకు రెడీ: నటుడు మోహన్ లాల్

‘మా అబ్బాయి నటుడిగా తన కెరీర్ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాడు’ అని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించే చిత్రంలో తన తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా నటించనున్నాడని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు ప్రణవ్ మోహన్ లాల్ ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. కాగా, మోహన్ లాల్ ఇటీవల నటించిన 'జనతా గ్యారేజ్’ చిత్రం ఆయనకు తెలుగునాట మంచి పేరును తెచ్చిపెట్టింది.

More Telugu News