: బీహార్ ప్రభుత్వానికి షాకిచ్చిన ఆ రాష్ట్ర హైకోర్టు.. మద్యపాన నిషేధ చట్టం నిలిపివేత

బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బీహార్ లో మద్యపానాన్ని నిషేధిస్తూ తీసుకొచ్చిన బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిల్లు - 2016ను చట్టవిరుద్ధమైనదిగా పేర్కొంటూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నిలిపివేసింది. ఎవరి ఇంట్లోనయినా లిక్కర్ బాటిల్ కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరినీ అరెస్ట్ చేసే అధికారాలను ఈ చట్టం అక్కడి ఎక్సైజ్ అధికారులకు కల్పిస్తోంది. ఈ చట్టానికి రాష్ట్ర ఉభయసభలతోపాటు గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. ఈ చట్టంలో పేర్కొన్న సెక్షన్లు అన్నింటిలోనూ స్టేషన్ స్థాయిలో బెయిల్ లభించదు. కేవలం కోర్టులు మాత్రమే జారీ చేయగలవు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దీని ఉల్లంఘన కేసులను కేవలం ప్రత్యేక కోర్టులు మాత్రమే విచారించగలవు. ఈ కొత్త చట్టం ప్రకారం ఏదైనా ప్రాంతంలో బెల్లం, ద్రాక్షపండ్లు కనిపించినా సరే లిక్కర్ తయారు చేస్తున్నట్టు భావించి అరెస్ట్ లు చేసే అధికారాలను ఇస్తోంది.

More Telugu News