: ‘పోలవరం’ నిర్మాణం ఆపివేయాలన్న ఒడిశా పిటిషన్ పై ‘సుప్రీం’లో విచారణ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ ఒడిశా రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ‘పోలవరం’ బ్యాక్ వాటర్ తో తమ గ్రామాలు మునిగిపోతాయని, తమకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మద్దతుగా ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకుంది. కాగా, బచావత్ అవార్డు ప్రకారం తమకు నీటిలో వాటా కావాలన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వ అభ్యంతరాలపై తమ వైఖరి తెలపాలని ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

More Telugu News