: ఇస్రో ఇచ్చిన ఫొటోలతో ముష్కరులను వేటాడిన సైనికులు

మొదటి సారి భారత సైన్యం ఇస్రో సాయం తీసుకుంది. అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది జూన్ లో కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం పాక్ అక్రమిత కశ్మీరులో భారత సరిహద్దులకు సమీపంలోనున్న ఉగ్రవాద శిబిరాలను ఫొటోల్లో బంధించగా, ఆ ఫొటోలను ఇస్రో సైన్యానికి అందించిది. ఈ ఫొటోల ఆధారంగా భారత సైనిక దళాలు పాక్ ఆక్రమిత కశ్మీరులోకి ప్రవేశించి సరిహద్దులకు సమీపంలో తిష్ట వేసిన ముష్కరులను నాలుగు గంటల్లోనే వేటాడి మట్టికరిపించాయి. సైన్యానికి అత్యంత స్పష్టతతో కూడిన చిత్రాలను అందించినట్టు, ఈ చిత్రాలను కార్టోశాట్ ఉపగ్రహం తీసినట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

More Telugu News