: దసరాకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే.. సికింద్రాబాద్-కాకినాడ మధ్య 10 రైళ్లు

దసరా రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-కాకినాడ మధ్య పది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమా శంకర్ కుమార్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. * సికింద్రాబాద్-కాకినాడ పోర్టు స్పెషల్ (రైలు నంబరు: 07011): అక్టోబరు 4, 11, 18, 25వ తేదీల్లో, నవంబరు 1వ తేదీన ఈ రైలు రాత్రి గంటలు 7:15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం గంటలు 5:45కు కాకినాడ పోర్టు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ రైలు(070012) అక్టోబరు 5,12, 19, 26, నవంబరు 2వ తేదీల్లో సాయంత్రం గంటలు 5:30 కాకినాడ పోర్టు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం గంటలు 4:30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. * సికింద్రాబాద్-పట్నా స్పెషల్ రైలు(నంబరు: 02793ను సువిధ స్పెషల్‌‌(నంబరు: 82701)గా మారుస్తూ అక్టోబరు 28న నడపనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి అక్టోబరు 28న ఉదయం గంటలు 8:35కు బయలుదేరి శనివారం సాయంత్రం గంటలు 4:10కి పట్నా చేరుకుంటుంది. * దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్-దుర్గాపూర్ మధ్య నడుపుతున్న 14 ప్రత్యేక రైళ్లను జైపూర్ వరకు పొడిగించారు. * జైపూర్-హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ స్పెషల్(నంబరు: 02732) జైపూరు నుంచి అక్టోబరు 5,12,19, 26, నవంబరు 2, 9, 16 తేదీల్లో రాత్రి గంటలు 9:05కు బయలుదేరి శుక్రవారం ఉదయం గంటల 4:20కు సికింద్రాబాద్, గంటలు 5:10కి హైదరాబాద్ చేరుకుంటుంది.

More Telugu News