: భారత్ సైన్యం వెనుక మేమున్నామంటూ దేశభక్తి చాటుకున్న పలువురు ప్రముఖులు

సరిహద్దు ఆవల ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి గర్వకారణమంటూ కేంద్రమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సమర్థించారు. దేశం మొత్తం సైన్యం వెనుక నిలబడుతుందని ఆయా ట్వీట్లలో పేర్కొన్నారు. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పై సునిశిత దాడులు చేసిన భారత్ సైన్యాన్ని చూసి గర్వపడుతున్నానని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తమ ట్వీట్లలో ‘భారత్ మాతాకీ జై.. యావత్తు దేశం సైన్యం వెనుక ఉంది’ అని ట్వీట్లు చేశారు. పాకిస్థాన్ తీవ్రవాదిలా వ్యవహరిస్తోందని జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, తీవ్రవాదులందరికీ ఇది తగిన గుణపాఠమని బీజేపీ నాయకుడు షహనవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. కాగా, యూరీ సంఘటన అనంతరం పాకిస్థాన్ కాకుండా భారతదేశమే అంతర్జాతీయంగా ఏకాకి అయిపోతున్నట్లు కనిపిస్తోందంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆయన మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ‘భారత్ మాతాకీ జై’ అంటూ పేర్కొనడం గమనార్హం.

More Telugu News