: అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది... వదంతులు నమ్మకండి: అన్నాడీఎంకే

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏమైంది...? ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారా...? ఇప్పుడు తమిళనాడు వాసుల్లో చాలా మందిలో మెదులుతున్న సందేహం ఇది. ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి వారం రోజులు దాటి పోవడం, వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి తాజా సమాచారాన్ని ప్రకటించకపోవడం ఈ వదంతులకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని ఎటువంటి వదంతులను నమ్మవద్దని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు కోరాయి. ముఖ్యమంత్రి జయలలిత డీ హైడ్రేషన్, జ్వరంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వారం క్రితం చేరారు. కాగా జయలలిత ప్రస్తుతం కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉన్నారని, శుక్రవారం విడుదల అవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆస్పత్రి నుంచే ఆమె అధికారులతో మాట్లాడుతున్నారని చెబుతున్నాయి. చివరిగా జయలలిత ఆరోగ్యంపై వైద్యులు గత ఆదివారం ప్రకటన జారీ చేశారు. జయలలితకు జ్వరం లేదని, సాధారణ ఆహారాన్నే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షనేత పీఎంకేకు చెందిన రామదాస్ మాత్రం జయలలిత ఫొటోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News