: ‘ఖురాన్’లో అల్లా చెప్పినట్లు..‘గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి’: పాక్ రక్షణ మంత్రి

‘మా ఆయుధాలు ఆటబొమ్మలు కాదు.. మాకు ముప్పు ఉందని భావిస్తే వెంటనే ప్రయోగిస్తాం’ అని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిప్ అన్నారు. మూడు రోజుల క్రితం జియో టీవిలో ప్రసారమైన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం లేదు. కానీ, ఖురాన్ లో అల్లా చెప్పినట్లు.. ‘గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి’. పాకిస్థాన్ పై ఒత్తిడి ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన వాటి కంటే వ్యూహాత్మక ఆయుధాలు మన వద్ద ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంలో మనదే అధిక్యం అనేది అంతర్జాతీయంగా కూడా తెలిసిందే’ అన్నారు. ‘భారత్ తో యుద్ధం వస్తే పాక్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా?' అనే ప్రశ్నకు ఖ్వాజా మహ్మద్ స్పందిస్తూ.. అణ్వాయుధాలను ఉపయోగించడమనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

More Telugu News