: సార్క్ సదస్సుకు సభ్యదేశాలు సహకరించాలంటున్న నేపాల్

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నవంబరు 9, 10 తేదీల్లో జరగనున్న సార్క్ సదస్సుకు సభ్య దేశాలు సహకరించాలని నేపాల్ దేశం కోరింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సార్క్ అధ్యక్షస్థానంలో ఉన్న నేపాల్ ఈ సదస్సును సరైన సమాయానికే నిర్వహించాలని భావిస్తోంది. సదస్సు నిర్వహణకు తగిన వాతావరణాన్ని నెలకొల్పాలని ఆ ప్రకటనలో సభ్యదేశాలను కోరింది. కాగా, పాక్ లో జరగనున్న సార్క్ సదస్సుకు హాజరయ్యే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. భారత్ నిర్ణయానికి బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలు మద్దతుగా నిలిచాయి. అయితే, ఈ విషయంలో పొరుగుదేశమైన నేపాల్ భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

More Telugu News