: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ..‘పాక్’కు చీవాట్లు పెడుతూ అమెరికా పత్రిక కథనం

జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ పై ఉగ్రవాదుల దాడి అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ సైనిక చర్యకు దిగకుండా ఎంతో సహనం పాటిస్తున్నారంటూ అమెరికా డెయిలీ న్యూస్ పేపర్ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రశంసించింది. ఇండస్ వాటర్ నిలుపుదల, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల రద్దు వంటి అంశాలతో పాకిస్థాన్ కు ఊహించని విధంగా బుద్ధి చెప్పేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారని ఆ కథనంలో పత్రిక అభిప్రాయపడింది. అయితే, భారత్ వ్యూహాత్మక సహనం అన్నివేళలా పనిచేయదన్న విషయాన్ని పాకిస్థాన్ గ్రహించాలని ఆ పత్రిక సూచించింది. భారత్ నిగ్రహాన్ని అర్థం చేసుకోలేక, చేతగానితనంగా కనుక పాకిస్థాన్ భావిస్తే అంతర్జాతీయంగా ‘పాక్’ ఏకాకి కాక తప్పదని హెచ్చరించింది. భారత్ పై పాక్ మరిన్ని ఉగ్రదాడులకు దిగితే ఇండియా పూర్తి స్థాయి యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ రాసుకొచ్చింది. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వీడి ప్రధాని మోదీకి సహకరించాలని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ అభిప్రాయపడింది.

More Telugu News