: నీటిని ఆపేస్తే చూస్తూ ఊరుకుంటామా?: పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్

సింధు జలాలను భారత్ అడ్డుకుంటే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదురుతుందని ముషారఫ్ తెలిపారు. భారత్ తో తలపడాలని కోరుకోవడం లేదని, శాంతి ప్రక్రియ ద్వారానే కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని గతంలో కార్గిల్ యుద్ధానికి తెరలేపిన ఈ నేత పేర్కొన్నారు. పుట్టిన రోజు పర్యటనలు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపదని ఆయన సూచించారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మాస్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రభావితం చేయడం వల్లే సార్క్ సదస్సుకు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ రావడం లేదని ఆయన తెలిపారు. బలూచిస్థాన్ లో పాకిస్థాన్ జాతీయ జెండాలు తగులబెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తామని ముషారఫ్ తెలిపారు.

More Telugu News