: నల్లగా పుట్టాలని నేను కోరుకున్నానా?.. నల్లగా పుట్టడం నేను చేసిన పాపమా?: అమెరికన్లను కన్నీటితో కడిగేసిన నవ నల్లకలువ

అమెరికాలోని షార్లట్ నగరంలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనికి కారణం కారులో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న నల్లజాతీయుడైన కెయిత్ స్కాట్ ను ఎలాంటి హెచ్చరికలు లేకుండా చంపడమే! ఆ తరువాత మరో వ్యక్తి తన దగ్గర ఆయుధాలు లేవని చెబుతున్నా వినకుండా అతన్ని కూడా కాల్చిచంపడతో అల్లర్లు పెచ్చుమీరాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు షార్లట్ నగర మేయర్ ప్రత్యేకమండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జియాన్నా ఓలిఫత్ అనే నల్లజాతి చిన్నారి కన్నీటితో అమెరికన్లను పలు ప్రశ్నలు అడిగింది. వివరాల్లోకి వెళ్తే... 'నేను షార్లెట్ నగరంలోనే పుట్టి పెరుగుతున్నాను. కానీ ఇలా బాధపడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. షార్లట్ నగరంలో మమ్మల్ని ఎంత దారుణంగా చూస్తున్నారో నేను మాటల్లో చెప్పలేను. ఇది మా అమ్మనాన్నలకు సిగ్గుచేటు. వాళ్లను అకారణంగా చంపేస్తున్నారు. నల్లజాతీయులు బలైపోతుండడంతో భవిష్యత్ లో వారిని మేమెప్పటికీ చూడలేము. పోలీసుల తీరుతో అకారణంగా నల్లజాతీయులంతా శ్మశానం వద్దకు వెళ్లే పరిస్థితి వస్తున్నందుకు, చనిపోయిన వారిన పూడ్చి పెడుతున్నందుకు సిగ్గు పడాలి. ఇప్పుడు మా కళ్ల నిండా నీళ్లున్నాయి. కానీ అవి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పుడు మాకు కావాల్సింది కళ్లలో నీళ్లు కాదు...మా అమ్మనాన్నలు. మేమంతా నల్ల జాతీయులమే కానీ, మేం అలా భావించే పరిస్థితి మీరు రానివ్వకూడదు. మాకు మా హక్కులు కావాలి. అందుకే మేం పోరాడుతున్నాం. మేము కూడా మీలాంటి మనుషులమే. మా చర్మం రంగు చూసి మమ్మల్ని వేరుగా చూస్తున్నారు. ఈ రంగులోనే పుట్టాలని మేము కోరుకోలేదు. అయితే ఈ రంగులో పుట్టడం మేము చేసిన పాపమా? మీరు అలా భావించడం సరికాదు' అంటూ ఆమె నిండు సభలో కన్నీటితో అమెరికన్లను కడిగిపడేసింది.

More Telugu News