: కేసీఆర్ లేస్తే రాష్ట్రం నిద్ర‌లేవాలి.. ఆయన నిద్ర‌పోతే నిద్ర‌పోవాలి అన్న రీతిలో సీఎం ఉన్నారు: పొంగులేటి

భయ్యారం స్టీల్ ప్యాంట్, హైకోర్టు విభజనతో పాటు తెలంగాణ‌కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ ఏమ‌య్యాయ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ‌ ప్రజల చెవిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూలు పెడుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీల‌ను సాధించుకునే క్ర‌మంలో కేసీఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ లేస్తే రాష్ట్రం నిద్ర‌లేవాలి.. ఆయన నిద్ర‌పోతే నిద్ర‌పోవాలి అన్న రీతిలో సీఎం ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో మార్పు వ‌స్తుంద‌నే ఆశ‌ని ప్ర‌జ‌లు కోల్పోయార‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాలు వెన‌క‌బ‌డే ఉన్నాయ‌ని అన్నారు. రైతుల గోస కేసీఆర్‌కు ప‌ట్ట‌ట్లేదని అన్నారు. ఇన్‌పుట్ స‌బ్సిడీ ఇవ్వ‌డం త‌మ బాధ్య‌త కాదంటూ మాట్లాడుతున్నారని చెప్పారు.

More Telugu News