: నేటి నుంచి మళ్లీ మొదలైన రైళ్ల కూత.. విజయవాడలో ఆర్ఆర్ఐ పనులు పూర్తి

విజయవాడలో గత పది రోజులుగా చేపట్టిన రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం (ఆర్ఆర్) పనులు పూర్తి కావడంతో బుధవారం నుంచి రైళ్ల కూత మళ్లీ యథావిధిగా ప్రారంభమైంది. అనుకున్న సమయానికంటే ముందుగానే సోమవారం రాత్రే పనులు పూర్తికావడంతో మంగళవారం నుంచి 24 బోగీలున్న రైళ్లు ప్లాట్‌ఫారాలకు చేరుకుంటున్నాయి. ఆర్ఆర్ఐ పనులు పూర్తికావడంతో ప్రయాణికుల దశాబ్దాల ఇబ్బందులకు పరిష్కారం లభించినట్టయింది. వెయ్యిమంది రైల్వే కార్మికులు సహా మరో 1500 కాంట్రాక్ట్ కార్మికులు కలిసి ఆధునికీకరణ పనుల్లో పాల్గొన్నారు. ఆర్ఆర్ఐ క్యాబిన్‌లో కొత్త వ్యవస్థలను డీఆర్ఎం అశోక్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అయితే వచ్చే నెల తొలి వారంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు అధికారికంగా దీనిని ప్రారంభిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ఆర్ఆర్ఐ పనుల్లో భాగంగా రద్దయిన, దారి మళ్లిన రైళ్లు నేటి నుంచి యథావిధిగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News