: ఎండొచ్చింది... ఇక కదలండి: అధికారులతో కేటీఆర్

హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నేటి ఉదయం నుంచి వర్షం కురవడం లేదని, మేఘాల చాటు నుంచి సూర్యుడు బయటకు వచ్చాడని గుర్తు చేస్తూ, వెంటనే రోడ్లపై పేరుకుపోయిన గులక, ఇసుక, మట్టిని తొలగించాలని చెప్పారు. ఈ మధ్యాహ్నం జీహెచ్ఎంసీ అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మట్టి పేరుకుపోయి గుంతలు పడిన ప్రాంతాలపై తొలుత దృష్టిని సారించాలని, ఆపై తారు రోడ్లకు పడ్డ గుంతలు పూడ్చాలని సూచించారు. అందుకు అవసరమైన నిధులకు సంబంధించిన వివరాలు అందిస్తే, ఆ ప్రతిపాదనలను సీఎంకు పంపి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. మరమ్మతుల పర్యవేక్షణకు ఇతర శాఖల్లోని సీనియర్ ఇంజనీర్లను వినియోగించుకోవాలని తెలిపారు.

More Telugu News