: ఒబామాపై విరుచుకుపడిన ట్రంప్.. డిబేట్‌లో నిప్పులు

హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ప్రారంభమైన తొలి డిబేట్‌లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఒబామాపై విరుచుకుపడుతున్నారు. ఒబామా అధ్యక్షుడయ్యాక నాలుగు వేల మందిని చంపేశారని ఆరోపించారు. చికాగో వంటి చోట్ల శాంతిభద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఐదుగురు పోలీసు అధికారులను అన్యాయంగా చంపేశారని అన్నారు. ఐసిస్ ఎదుగుదలకు ఓ రకంగా ఒబామా, హిల్లరీనే కారణమని ఆరోపించారు. ఇంటర్నెట్ వినియోగంలో మనకంటే కూడా ఐసిస్ చాలా వేగంగా ఉందని పేర్కొన్నారు. ఇరాక్ నుంచి బలగాల ఉపసంహరణ విధానం సరిగా లేదని, ఐసిస్ ఎదుగుదలకు ఇది ఎంతగానో దోహదం చేసిందని ట్రంప్ పేర్కొన్నారు.

More Telugu News