: పాలస్తీనా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పిన ‘ఫేస్ బుక్’

పాలస్తీనాకు చెందిన పలువురు జర్నలిస్టులు, ప్రముఖ వ్యక్తులకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ క్షమాపణలు చెప్పింది. ఎటువంటి కారణం లేకుండా ఆ జర్నలిస్టుల, ప్రముఖ వ్యక్తుల ఫేస్ బుక్ అకౌంట్లను నిలిపివేసిన కారణంగానే వారికి క్షమాపణలు చెప్పింది. ఎటువంటి కారణం లేకుంగా తమ అకౌంట్లను నిలిపివేయడంపై బాధితులు ఆందోళనకు దిగడమే కాకుండా, ‘ఫేస్ బుక్’కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కలిసి తమ అకౌంట్లను ‘ఫేస్ బుక్’ నిలిపివేసిందనే ఆరోపణలపై సదరు సంస్థ స్పందిస్తూ, అటువంటిదేమీ లేదని, లక్షలాది పేజీలను ప్రాసెస్ చేసే నేపథ్యంలో ఎక్కడో పొరపాటు జరిగిందని తెలిపింది. ఆ విషయం తమ దృష్టికి రాగానే ఆయా అకౌంట్లను పునరుద్ధరించామని ఫేస్ బుక్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

More Telugu News