: పాక్ ప్రధాని నవాజ్ కు దీటుగా బదులివ్వనున్న సుష్మా స్వరాజ్

ఐరాస సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరికాసేపట్లో ప్రసంగించనున్నారు. గత వారంలో పాక్ ప్రధాని ఇదే వేదికపై మాట్లాడుతూ, కాశ్మీర్ లో అల్లకల్లోలానికి భారత్ కారణమని ఆరోపిస్తూ, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వనీని పొగుడుతూ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వాదనను ఖండిస్తూ, పాక్ చేస్తున్న కుట్రలను అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లి, పాక్ వైఖరిని ఎండగట్టేందుకు సుష్మా ప్రయత్నించనున్నారు. ఆమె ప్రసంగం నేటి రాత్రి 7:20 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొదలు కానుంది. ద్వైపాక్షికంగా పాక్ ను ఒంటరి చేయాలన్న ఆలోచనతో ఆమె ప్రసంగించాల్సిన అంశాలపై ఇప్పటికే మోదీతోను, రక్షణ, హోం శాఖల మంత్రులతోను ఆమె చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే సుష్మా ప్రసంగంలో, పాక్ ఎలా ఉగ్రవాదులకు సహకరిస్తున్నది, యుద్ధ నేరాలకు ఎలా పాల్పడుతున్నది, ఉగ్రవాదులను ఎలా భారత్ కు పంపి అరాచకాలు చేస్తున్నదన్న అంశాల ప్రస్తావన ఉండనుంది.

More Telugu News