: ప్రేమ లేఖ రాయాలా... అయితే 99 రూపాయలు చెల్లిస్తే సరి!

తోకలేనిపిట్టగా పిలుచుకునే ఉత్తరం గతచరిత్ర ఘనమైనది. ఎన్నో అనుభవాలు, అనుభూతులకు ఉత్తరం నిలయమై నిలిచింది. ఎంతో మంది కష్టసుఖాల్లో పాలుపంచుకుందీ ఉత్తరం. అలాంటి ఉత్తరం నేడు సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల ఆగమనంతో ఆదరణ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాలు రాస్తామంటూ ఓ స్టార్టప్ కంపెనీ వెలసింది. అంకిత్‌ అనుభవ్‌, జశ్వంత్‌ అనే ఇద్దరు యువకులు ‘ద ఇండియన్‌ హ్యాండ్‌రిటెన్‌ లెటర్‌ కో’(టీఐహెచ్‌ఎల్‌సీ) పేరుతో ఈ స్టార్టప్ కంపెనీని ఆరు నెలల కిత్రం ప్రారంభించారు. లెటర్‌ మెయిల్‌, కెల్లీయెల్లీ అనే స్టార్టప్స్‌ కూడా ఇలా ఉత్తరాలు రాస్తుంటాయి. ఆంగ్లం, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో వీళ్లు రాసే ఒక్కో ఉత్తరానికి 99 రూపాయలు వసూలు చేస్తారు. స్టార్టప్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వాళ్లు 2500 ఉత్తరాలు రాస్తే, వాటిల్లో ఎక్కువగా ప్రేమ లేఖలే ఉండటం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఢిల్లీ/ఎన్‌సీఆర్‌ నుంచే ఎక్కువ మంది ఉత్తరాలు రాసి పెట్టమని వారిని కోరుతున్నారట. మనం ఎవరికైతే ఉత్తరం రాయాలని అనుకుంటున్నామో, అందులో ఏం రాయాలో చెబితే అందుకు తగ్గట్టుగా, మనసును హత్తుకునేలా ఉత్తరాలు రాసే భాధ్యత అనుభవ్, జశ్వంత్ లదే. ఈమెయిల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా వాళ్లకి సమాచారాన్ని అందించి డబ్బులు చెల్లించి అడ్రెస్ చెబితే...మీరు కోరుకున్న వారికి కోరుకున్నట్టు రాసిన ఉత్తరం అందుతుంది.

More Telugu News