: ప్రతిష్ఠాత్మక 500వ టెస్టులో రెండు ప్రపంచ రికార్డులు

ప్రతిష్ఠాత్మక 500వ టెస్టులో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 37 టెస్టుల్లో 200 వికెట్లు సాధించి, ప్రపంచంలోనే ఈ ఫీట్ అందుకున్న బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు. అంతే కాకుండా, ఒక టెస్టులో అత్యధిక బ్యాట్స్ మన్ అర్ధ సెంచరీలు సాధించిన టెస్టు కూడా ఇదే కావడం విశేషం. ఈ టెస్టులోని నాలుగు ఇన్నింగ్స్ లలో మొత్తం పది మంది బ్యాట్స్ మన్ అర్ధసెంచరీలు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (65), ఛటేశ్వర్ పూజారా (62), విలియమ్సన్ (75), లాంథమ్ (58) అర్ధ సెంచరీలు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (76), పూజారా (78), రోహిత్ శర్మ (68 నాటౌట్), రవీంద్ర జడేజా (50 నాటౌట్), ల్యూక్ రోంచీ (80), సాంట్నార్ (71) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ఒక టెస్టులో అత్యధిక బ్యాట్స్ మన్ అర్ధ సెంచరీలు సాధించిన టెస్టుగా కూడా ఇది చరిత్రలో నిలిచిపోనుంది.

More Telugu News