: మురుగు కాల్వలో పవిత్ర గ్రంథాలు... జలంధర్ లో తీవ్ర ఉద్రిక్తత

సిక్కులకు పవిత్రమైన గురు గ్రంథ సాహిబ్, భగవద్గీత పుస్తకాల్లోని కొన్ని పేజీలు మురుగు కాల్వలో కనిపించడంతో జలంధర్ ఉద్రిక్తంగా మారింది. గురు గ్రంథ్ సాహిబ్ లోని దాదాపు 200 పేజీలు ఈ కాలువలో కనిపించాయి. దీంతో ఆగ్రహానికి గురైన సిక్ తాల్ మేల్ కమ్యూనిటీ, కొన్ని హిందూ సంస్థలు కపుర్తలా చౌక్ వద్ద నిరసనలకు దిగాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రిన్స్ పాల్ సింగ్ అనే యువకుడు ఓ గురుద్వారా నుంచి వస్తూ కాలువలో ఈ పేజీలను చూడటంతో విషయం బయటకు వచ్చింది. నిరసనల విషయం తెలుసుకున్న సిక్కులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ నేరస్తులు ఎవరన్న విషయాన్ని గుర్తించి చట్టం ముందు నిలుపుతామని తెలిపారు.

More Telugu News