: గుంటూరును వదిలి విశాఖ జిల్లాపై వరుణాగ్రహం... కుంభవృష్టితో ఎక్కడికక్కడ నిలిచిన రైళ్లు

గత వారంలో గుంటూరు జిల్లాపై తన ఆగ్రహాన్ని చూపిన వరుణుడు గత రాత్రి నుంచి విశాఖ జిల్లాను వణికిస్తున్నాడు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఎలమంచిలి- నర్సీపట్నం రోడ్ మధ్య ట్రాక్ పై నాలుగడుగుల మేరకు వరద నీరు పారుతోంది. లైను కొత్తూరు వద్ద కూడా రైల్వే ట్రాక్ పైకి నీటి ప్రవాహం చేరింది. దీంతో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను అన్నవరంలో నిలిపివేశారు. విశాఖ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ యలమంచిలిలో, రామేశ్వరం నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్ ను తునిలో ఆపేశారు. రాజమండ్రి, విశాఖ నుంచి కదలాల్సిన రైళ్లు ఆయా స్టేషన్లలో గ్రీన్ సిగ్నల్ కోసం రెండు గంటల నుంచి వేచి చూస్తున్నాయి. రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు యలమంచిలి పాత జాతీయ రహదారిపై శేషుగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలూ నిలిచిపోయాయి.

More Telugu News