: రేపటి తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు

వర్షాల కారణంగా రేపు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు అయింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు కారణంగా మంత్రులు జిల్లాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మంత్రులు జిల్లా కేంద్రాలను వదిలి ఎక్కడికి వెళ్లవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్ లోను, ఇతర జిల్లాల్లోను వరద పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకున్న తర్వాతే కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

More Telugu News