: వర్షాలపై మీడియా అతి చేయవద్దు: కేసీఆర్

హైదరాబాద్ లో కురిసిన తాజా వర్షాలకు ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని, ఒక్క జంతువు కూడా చనిపోలేదని గుర్తు చేసిన కేసీఆర్, ఇక్కడి పరిస్థితిని ప్రసార మాధ్యమాలు అతిగా చూపి నగరానికి చెడ్డ పేరును తెస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భాగ్యనగరిలో అంతటి భయంకర పరిస్థితులేమీ లేవని అన్నారు. వర్షాలపై ఈ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించిన కేసీఆర్, నీటి పారుదల మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మలతో మాట్లాడారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చిందని, ఈ సీజన్ ఖరీఫ్, రబీకి పూర్తిగా నీరందించవచ్చని అధికారులు వివరించారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో ప్రాజెక్టుల పరిస్థితిపై ఆ రాష్ట్ర నీటి పారుదల మంత్రి గిరీశ్ కు హరీశ్ రావు ఫోన్ చేసి మాట్లాడారు. గోదావరిలో నీటి ఉద్ధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కేసీఆర్ సూచించారు. వాస్తవ పరిస్థితిని మాత్రమే మీడియా చూపాలని హితవు పలికారు. అతిగా చెప్పి, చూపి ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన కలిగించవద్దని సూచించారు.

More Telugu News