: ఎన్నో విశిష్టతలను వెంటబెట్టుకుని వస్తున్న అక్టోబర్ నెల!

మరో వారంలో సెప్టెంబర్ ముగిసి అక్టోబర్ నెల వస్తుంది. ఆ ఏముంది మరో నెల వస్తోంది అని అనుకుంటున్నారా? అలాకాదు... ఎన్నో విశిష్టతలను అక్టోబర్ వెంటబెట్టుకుని మరీ వస్తోంది. ఈ నెలలో ఐదు శని, ఆది, సోమవారాలు వస్తున్నాయి. ఇది రావడం కొంత అరుదు. 1, 8, 15, 22, 29 తేదీల్లో శనివారం, 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారం, 3, 10, 17, 24, 31 తేదీల్లో సోమవారం వస్తున్నాయి. ఇంకా విశేషమేమంటే, బతుకమ్మ, దసరా, దీపావళి, పీర్ల పండుగ కూడా ఈ నెలలోనే. 11న దసరా, 12న పీర్ల పండగ, 30న దీపావళి ఉన్నాయి. ఐదు ఆదివారాలు, మూడు పండగలు, రెండు, నాలుగు శనివారాలు కలిపి ప్రభుత్వ ఉద్యోగులకు 9 సెలవులు రానుండగా, విద్యార్థులకు దాదాపు సగం రోజుల పాటు హాలిడేస్. ఇంకో చిన్న విశేషం ఏంటంటే, 2వ తేదీ ఆదివారం నాడు అమావాస్య, 16వ తేదీ ఆదివారం నాడు పౌర్ణమి, 30వ తేదీ ఆదివారం నాడు మరో అమావాస్య రానున్నాయి. ఇది అత్యంత అరుదు. మరి అక్టోబర్ నెల స్పెషలేకదా?

More Telugu News