: కావేరిలో నీరు లేదని నిరూపించండి: సిద్ధరామయ్యను ఆదేశించిన కాంగ్రెస్ అధిష్ఠానం

తమిళనాడుకు వదిలేందుకు కావేరీ నదిలో సరిపడినంత నీరు లేదని కర్ణాటక సర్కారు వాదిస్తున్న వేళ, అదే విషయాన్ని నిరూపించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యను కోరింది. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా తమిళనాడుకు నీరు ఇచ్చే అవకాశాలు లేవని, ఆ మేరకు తమ వద్ద నిల్వ లేదని కర్ణాటక అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన దరిమిలా, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా చూసేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం తెలియజేస్తూ, కోర్టు ఆదేశాలను అమలు చేసేంతగా నీరు అందుబాటులో లేదని, తాము కావాలని నీటిని అడ్డుకోవాలని చూడటం లేదని కోర్టులో ఆధారాలతో సహా నిరూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేటీఎస్ తులసి సలహా ఇచ్చారు. కావేరీలో కేవలం 27 వేల మెట్రిక్ టన్నుల నీరు మాత్రమే ఉందని, అది బెంగళూరు, మైసూరు ప్రజల తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని అసెంబ్లీలో కర్ణాటక ప్రభుత్వం చెప్పిన అంశానికి సాక్ష్యాలను సుప్రీంకోర్టుకు అందించాలని ఆయన సలహా ఇచ్చారు.

More Telugu News